Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీడీపీతో పొత్తు ఉంటుందా? అన్న విజయశాంతి ప్రశ్నకు బండి సంజయ్ సమాధానం ఇదే!

There will be no alliance with TDP says Bandi Sanjay
Advertisement
  • తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందంటూ ప్రచారం
  • ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని అడిగిన విజయశాంతి, అర్వింద్
  • పొత్తు ఉండదని తెలిపిన బండి సంజయ్
Advertisement
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన పార్టీతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తుండగా... రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో పొత్తుల వ్యవహారాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవచ్చనే ప్రచారం కూడా ఊపందుకుంది. 

ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని విజయశాంతి, ఎంపీ అర్వింద్ తదితరులు అడిగారు. దీనికి సమాధానంగా టీడీపీతో పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే నిజామాబాద్, వరంగల్ లలో టీడీపీ బహిరంగసభలు జరగనున్న తరుణంలో బండి సంజయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Advertisement
Advertisement
Bandi Sanjay
BJP
Vijayashanti
D Arvind
Telugudesam

More Telugu News